sampath nandi: రాజమౌళి రూట్లోనే వెళతానంటోన్న సంపత్ నంది!

ఒకప్పుడు కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని, ఆ తరువాత ఆ కథలోని పాత్రలకి తగిన నటీనటులను ఎంపిక చేసుకునేవారు. ఇక కొంత కాలం నుంచి హీరో డేట్స్ తీసుకుని ఆయన క్రేజ్ కి తగినట్టుగా ఆయన చుట్టూ తిరిగే కథలను రెడీ చేసుకోవడం మొదలైంది. అయితే రాజమౌళి మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన పాతకాలంలో మాదిరిగానే కథ రెడీ అయిన తరువాతనే, పాత్రలకి తగిన నటీనటులను తీసుకుంటారు.

'గౌతమ్ నంద' నుంచి తనదీ అదే పద్ధతి అంటున్నాడు సంపత్ నంది. కథను రెడీ చేసుకున్న తరువాతనే గోపీచంద్ ను తీసుకోవడం జరిగిందని చెబుతున్నాడు. హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుండటం వలన, మంచి కథలను తొక్కేసినట్టు అవుతోందని అంటున్నాడు. నెక్స్ట్ మూవీకి కూడా నాలుగు నెలల సమయం తీసుకుని మంచి కథను సిద్ధం చేసుకుంటాననీ .. ఆ తరువాతనే కథకి తగిన హీరో గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు.
sampath nandi

More Telugu News