nayanatara: ప్రియుడికి బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చిన నయన్!

ఒక వైపున వరుస సినిమాలతోను .. మరో వైపున ప్రేమ వ్యవహారాలతోను నయనతార ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. నయనతార చేతిలో ఇప్పుడు అరడజను తమిళ చిత్రాలు వున్నాయి. జయాపజయాలకు అతీతంగా ఆమెకు అవకాశాలు వస్తుండటం .. రెమ్యునరేషన్ పెరుగుతుండటం విశేషం.

ఆమె సినిమాలకి సంబంధించిన కబుర్లతో పాటు .. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమ వ్యవహారం గురించి కూడా కోలీవుడ్ జనాలు చెప్పుకుంటూ వుంటారు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇటు నయనతార గానీ .. అటు విఘ్నేశ్ శివన్ గాని ఖండించకపోవడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో అతడికి ఆమె ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చిందనేది తాజా సమాచారం. కోలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
nayanatara

More Telugu News