varin tej: కేసీఆర్ ను కలవాలనుకుంటోన్న 'ఫిదా' టీమ్!

విభిన్నమైన కథా కథనాలను కలిగిన చిత్రాలను తెరకెక్కించడం .. విజయాలను అందుకోవడం దిల్ రాజుకి అలవాటే. అయితే 'ఫిదా' సక్సెస్ ను మాత్రం ఆయన చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉండటం విశేషం. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి విశేషమైన రెస్పాన్స్ వస్తోంది.

 ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణకి దిల్ రాజు  చాలా ఆనందంతో ఉన్నారట. ఈ సినిమా కోసం ఖర్చు చేసిన మొత్తంలో సగం నైజామ్ ఏరియా నుంచి వసూలు కావడం విశేషం. ఈ సినిమా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా యూనిట్ రెండు రోజుల్లో ఆయనని కలిసి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నట్టు సమాచారం.
varin tej
sai pallavi

More Telugu News