oviya: తరుణ్ హీరోయిన్ కి పెరుగుతోన్న క్రేజ్!

కుర్రహీరోగా మంచి మార్కులు కొట్టేసిన తరుణ్, ఆ తరువాత కథల ఎంపికలో పొరపాట్లు చేస్తూ పరాజయాలను చవిచూశాడు. అలా కొంత గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ 'ఇది నా లవ్ స్టోరీ' అనే ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో 'ఓవియా' అనే అమ్మాయి కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

తమిళ .. మలయాళ .. కన్నడ ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మాయికి ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ పెరుగుతోందట. ప్రస్తుతం ఈ అమ్మాయి తమిళ 'బిగ్ బాస్' లో కంటెస్టెంట్ గా వుంది. ఈ షో ద్వారా ఈ అమ్మాయి క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పుకుంటున్నారు. ఈ షో నుంచి ఓవియా బయటికి రాగానే ఆమెతో అగ్రిమెంట్ చేయించుకోవడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. ముందుగా ఆమె విజయ్ సేతుపతితో ఓ సినిమాను ఓకే చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

More Telugu News