charan: చరణ్ కి, అఖిల్ కి గట్టి పోటీ తప్పనట్టే వుంది!

చరణ్ 'రంగస్థలం'తో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో పవన్ సినిమా రానుండటంతో, క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని తన సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో వచ్చి ఆయనకి అఖిల్ గట్టి పోటీ ఇవ్వనున్నాడనేది తాజా సమాచారం.

 అఖిల్ కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి 'హలో గురూ ప్రేమకోసమే' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్టు నాగార్జున చెప్పారు. ఆ సమయంలో వద్దామనుకున్న చరణ్ ఆలోచనలో పడినట్టు టాక్. ఇద్దరూ ఇదే తేదీని ఫిక్స్ అయితే మాత్రం గట్టి పోటీనే వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
charan
akhil

More Telugu News