nara rohith: 'బాలకృష్ణుడు' కూడా దసరాకే వచ్చేస్తాడట!

వైవిధ్యభరితమైన కథా చిత్రాలను చేస్తూ నారా రోహిత్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'శమంతకమణి' ఆయనకి సంతృప్తినిచ్చే ఫలితాన్ని తీసుకొచ్చింది. దాంతో ఆయన తదుపరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కథలో రాజకుమారి' రెడీ అవుతోంది. వచ్చేనెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాపై కూడా నారా రోహిత్ గట్టి నమ్మకంతో వున్నాడు.

 ఈ ప్రాజెక్టు తరువాత ఆయన చేస్తోన్న సినిమాకి 'బాలకృష్ణుడు' అనే టైటిల్ ని ఖరారు చేశారు. పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నారా రోహిత్ న్యూ లుక్ తో కనిపించనున్నాడు. ఈ రోజున ఆయన పుట్టిన రోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, నిన్ననే ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్టు లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్లో పెద్ద సినిమాల పోటీవున్నప్పటికీ, ఎక్కడైనా కాస్త గ్యాప్ దొరికితే ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా చెబుతున్నారు.      
nara rohith

More Telugu News