krishnavamsi: నాపై కొంతమంది హీరోలు అందుకే అలుగుతారు: కృష్ణవంశీ

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ దర్శకులలో కృష్ణవంశీ ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తారు. వినోదంతో సందేశాన్ని కలిపి అందించే దర్శకులలో ఆయన ఒకరు. సిందూరం .. ఖడ్గం .. మహాత్మ వంటి సినిమాలు దర్శకుడిగా కృష్ణవంశీ గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి కృష్ణవంశీతో పనిచేయడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని కొంతమంది నటీనటులు వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయాన్ని గురించి కృష్ణవంశీ దగ్గర ప్రస్తావిస్తే .. ఆయన తనదైన శైలిలో స్పందించారు.

 నటీనటుల నుంచి అనుకున్న అవుట్ పుట్ వచ్చేంతవరకూ తాను మళ్లీ మళ్లీ చేయిస్తూనే ఉంటానని కృష్ణవంశీ అన్నారు. కొంతమందికి డైలాగులు గుర్తుండక పోవడం వలన కూడా టేకులు పెరుగుతాయని చెప్పారు. దాంతో వాళ్లు అసహనానికి లోనై తనపై అలుగుతూ ఉంటారని అన్నారు. తనతో పనిచేయడం కష్టమని బయట చెప్పుకునే వారికంటే, తన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పుకునేవారే ఎక్కువగా వున్నారని చెప్పారు. అదే తనకి ఎంతో సంతృప్తిని ఇస్తుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.          
Go Back to Shorts
krishnavamsi

More Telugu News