bellamkonda srinivvas: బోయపాటి మార్క్ టీజర్ అదరగొట్టేస్తోంది

'జయ జానకి నాయక' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి బోయపాటి శ్రీను రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి రొమాంటిక్ ఫీల్ వున్న ఫస్టులుక్ ను బోయపాటి వదిలాడు. రెండవ లుక్ యాక్షన్ కి సంబంధించినది రిలీజ్ చేశాడు. అలాగే ఫస్టు టీజర్ లో రొమాంటిక్ లవ్ కి ప్రాధాన్యతనిచ్చిన ఆయన, యాక్షన్ లవ్ తో కూడిన సీన్స్ పై రెండవ టీజర్ ను కట్ చేశాడు.

 ''లైఫ్ లో కష్టం వచ్చిన ప్రతి సారీ లైఫ్ ను వదులుకోం .. కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను మాత్రం వదులుకోను .. ఎందుకంటే నేను ప్రేమించా" అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఒకే ఒక్క లుక్ తో జగపతి బాబు విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందో చూపించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోయిజంపై కట్ చేసిన ఈ టీజర్ .. బోయపాటి మార్క్ తో ఆకట్టుకుంటోంది. ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

 
bellamkonda srinivvas
rakul

More Telugu News