sathyaraj: 'సంఘమిత్ర' మూవీలోను 'కట్టప్ప' కీలకం?

'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలు చూసిన వాళ్లు 'కట్టప్ప' పాత్రను అంత తొందరగా మరిచిపోలేరు. సత్యరాజ్ ఆ పాత్రను అంత అద్భుతంగా పండించారు. ఇంతవరకూ తను చేసిన పాత్రల్లో 'కట్టప్ప' పాత్ర ప్రత్యేకమని ఆయనే చెప్పారు. ఈ సినిమాలో అంతటి కీలకమైన పాత్రను పోషించిన సత్యరాజ్ ను, 'సంఘమిత్ర' సినిమా కోసం ఎంపిక చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 'బాహుబలి' సినిమాతో దేశ వ్యాప్తంగా ఆయనకి వచ్చిన క్రేజ్ .. ఆయనని తీసుకోవడం వలన తమ ప్రాజెక్టుకు వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందువలన తమ సినిమాలో ఒక కీలక పాత్ర చేయవలసిందేనంటూ భారీ ఆఫర్ ఇస్తున్నారట. సత్యరాజ్ తన నిర్ణయం చెప్పాల్సి వుంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా హన్సిక పేరు వినిపిస్తోంది.     
sathyaraj

More Telugu News