sridhar seepaana: త్రివిక్రమ్ బాటలోనే 'సర్దార్ గబ్బర్ సింగ్' రైటర్!

చిత్రపరిశ్రమలో దర్శకులుగా మారిన రచయితలు కొంతమంది వున్నారు. తమ సినిమాలకి తామే రాసుకుంటూ వరుస విజయాలను దక్కించుకుంటున్నారు. దాంతో కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న మరికొందరు అదే దారి పడుతున్నారు. అలాంటివారి జాబితాలో తాను చేరిపోతున్నానని శ్రీధర్ సీపాన అన్నారు.

 పూలరంగడు .. లౌక్యం .. సర్దార్ గబ్బర్ సింగ్ .. అహ నా పెళ్లంట .. డిక్టేటర్ వంటి సినిమాలకి కథా రచయితగా పనిచేసిన ఆయన, 'బృదావనమది అందరిది' అనే సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందనీ .. కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఉంటుందని ఆయన అన్నారు. ఈ నెల 29న తన పుట్టిన రోజనీ .. ఆ రోజున పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.  
sridhar seepaana

More Telugu News