prabhas: 75 రోజులను పూర్తిచేసుకున్న 'బాహుబలి 2'

వెండితెరపై 'బాహుబలి 2' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ .. కొత్త రికార్డులను సృష్టిస్తూ వెళుతోంది. అలా ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు థియేటర్స్ లో 75 రోజులను పూర్తి చేసుకుంది. యాక్ ఇదే జోరును కొనసాగిస్తూ ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకుంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ఈ సినిమా 75 రోజుల మైలురాయిని దాటిన సందర్భంగా .. ఆయా ప్రాంతాల్లో లాభాలు పొందిన డిస్ట్రిబ్యూటర్లు సెలబ్రేషన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకునే సమయం కోసం ప్రభాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే 'బాహుబలి 2' సినిమాను, చైనా .. జపాన్ . . రష్యాలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.         

More Telugu News