sundeep kishan: 'నక్షత్రం' పోలీసులపై గౌరవం పెంచుతుందంటోన్న కృష్ణవంశీ!

కృష్ణవంశీ సినిమాల్లో కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆసక్తికరమైన కథాకథనాలను సూటిగా చెప్పేయడం ఆయన ప్రత్యేకత. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలే అందుకు నిదర్శనాలు. అలాంటి కృష్ణవంశీ తాజాగా 'నక్షత్రం' సినిమాను తెరకెక్కించాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ .. సమాజాన్ని పోలీస్ కోణంలో చూపించానని చెప్పారు.

 పోలీస్ అంటే ఏమిటీ? అనే విషయాన్ని ఈ సినిమా చాటి చెబుతుందని అన్నారు. పోలీసులు ఎలా పనిచేస్తారు? కర్తవ్య నిర్వహణలో వాళ్లు ఎంతగా కష్టపడతారనేది ఈ సినిమాలో చూపించడం జరిగిందని చెప్పారు. ఈ సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్ మెంట్ పై మరింతగా గౌరవం పెరగడం ఖాయమని అన్నారు. సందీప్ కిషన్ .. సాయి ధరమ్ తేజ్ .. రెజీనా .. ప్రగ్యా జైస్వాల్ ప్రధానమైన పాత్రలు పోషించగా, ప్రకాశ్ రాజ్ .. జేడీ చక్రవర్తి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.         
sundeep kishan
regina

More Telugu News