: వింబుల్డన్ విజేత ఫెదరర్.. 19 గ్రాండ్ శ్లామ్ లతో చరిత్ర!

వింబుల్డన్ లో స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. 8వసారి ఛాంపియన్ గా నిలిచాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్  ఫైనల్స్ లో క్రొయేషియా క్రీడాకారుడు మారిన్ సిలిక్ పై ఘన విజయం సాధించాడు. సిలిక్ పై 6-3, 6-1,6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ విజయంతో ఫెదరర్ కెరీర్ లో 8వ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించినట్టయింది.

గతంలో పీట్ సంప్రాస్ వింబుల్డన్ టైటిల్స్  సాధించాడు. తాజా విజయంతో ఫెదరర్ ఈ రికార్డును అధిగమించాడు. దీంతో,అత్యధిక వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్ గా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు.అంతేకాకుండా, వింబుల్డన్ గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఫెదరర్ ఖాతాలో 19వ గ్రాండ్ శ్లామ్ వచ్చి చేరింది.

కాగా, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012లో వింబుల్డన్ టైటిళ్లను ఫెదరర్ సాధించాడు. 2012లో ఆండీ ముర్రేను ఓడించి, వింబుల్డన్ టైటిల్ ను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. 2014, 2015 వింబుల్డన్ సింగిల్స్ లో ఫెదరర్ రన్నరప్ గా నిలిచాడు. 

More Telugu News