Nayanatara: 'ఉయ్యాలవాడ' కోసం నయనతారకి 4 కోట్లు?

చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని తెరకెక్కించడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు .. మరో కీలక పాత్ర ధారిణి ఉండనున్నారు. ఒక కథానాయికగా ఐశ్వర్య రాయ్ ను .. మరో కథానాయికగా నయనతారను తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమె డిమాండ్ చేసిన విధంగా 4 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సాధారణంగా ఒక భాషలో చేసే సినిమాకే నయనతార  రెండున్నర నుంచి మూడు కోట్ల వరకూ తీసుకుంటుంది. ఈ సినిమా నాలుగు భాషలకి సంబంధించినది కావడంతో ఆమెకి 4 కోట్లు ముడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. 
Nayanatara
Chiranjivi

More Telugu News