sharvanand: రెండు సినిమాలను లైన్లో పెట్టేసిన శర్వానంద్!

మాంచి జోరుమీదున్న యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలు .. తన నుంచి అభిమానులు కోరుకునే కథలను ఎంచుకోవడం శర్వానంద్ ప్రత్యేకత. అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కథలనే ఆయన ఓకే చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన ప్రస్తుతం రెండు సినిమాలను అంగీకరించాడు.

 కె. రాఘవేంద్రరావు తనయుడు కె.ఎస్. ప్రకాశ్ దర్శకత్వంలో ఒక సినిమా, సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండూ కూడా విభిన్నమైన కథా కథనాలతోనే తెరకెక్కుతాయట. ఈ రెండు సినిమాలకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ రెండు సినిమాలతోను తన విజయాలను ఆయన కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.     
sharvanand

More Telugu News