nayanatara: తనపై నయనతారకి కోపం పోయిందంటోన్న తమిళ దర్శకుడు!

ఆ మధ్య తమిళంలో భారీ విజయాలను సాధించిన సినిమాలలో 'తనీ ఒరువన్' ఒకటి. జయం రవి .. అరవింద్ స్వామి .. నయనతార ప్రధానమైన పాత్రలుగా మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ అయినా నయనతార గురించి పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. తన పాత్రకి ప్రాధాన్యత లేకపోవడమే అందుకు కారణమని దర్శకుడి దగ్గర నయనతార అసహనాన్ని వ్యక్తం చేసిందట.

 దాంతో 'వేలైక్కారన్' చిత్రంలో నయనతారకి బలమైన పాత్రను ఇచ్చానని మోహన్ రాజా చెప్పాడు. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాలో తన పాత్ర పట్ల నయనతార సంతృప్తిగా ఉందనీ, తనపై ఆమెకి గల కోపం పోయిందని మోహన్ రాజా చెప్పాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నామని అన్నాడు.   
nayanatara

More Telugu News