ntr: ఈ నెలాఖరున 'జై లవ కుశ' రెండవ టీజర్

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న 'జై లవ కుశ' సినిమా నుంచి ఇటీవల ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో జై .. లవ .. కుశ అనే మూడు పాత్రలను పోషిస్తున్నాడు. ముందుగా 'జై' పాత్రకి సంబంధించిన టీజర్ ను వదిలారు. ఈ పాత్రను తీర్చిదిద్దిన తీరుకి .. ఎన్టీఆర్ నటనలో కొత్తదనానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 ఇక ఈ నెలాఖరున రెండవ టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే డేట్ చెప్పనున్నారట. ఈ సారి 'లవ' పాత్రకి  సంబంధించిన టీజర్ ను వదులుతారని తెలుస్తోంది. ఈ పాత్రలో ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. మొదటి టీజర్ కి మించి రెండవ టీజర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. రాశిఖన్నా .. నివేదా థామస్ .. నందితా రాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.   

More Telugu News