balakrishna: బాలకృష్ణతో సినిమా గురించి సాయి కొర్రపాటి!

'వారాహి చలన చిత్ర' సంస్థ అధినేతగా  ..పంపిణీదారుడిగా సాయి కొర్రపాటికి మంచి పేరుంది. ఆయన బ్యానర్లో వచ్చే సినిమాలు కథా బలాన్ని కలిగినవిగా వుంటాయని ఆడియన్స్ చెప్పుకుంటూ వుంటారు. అలాంటి సాయి కొర్రపాటి తాజాగా 'పటేల్ సర్' సినిమాను నిర్మించారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడారు.

ఇది జగపతిబాబుకి మాత్రమే సరిపోయే కథ అనీ .. అందువలన ఆయనతో చేశానని చెప్పారు. ఈ సినిమా చూసిన వాళ్లు 'అబ్బా .. జగపతి బాబు ఏం చేశాడ్రా .. " అనుకోవడం ఖాయమని అన్నారు. 400 థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని అన్నారు. ఇక అనుకున్నట్టుగా జరిగితే బాలకృష్ణతో ఈ ఏడాదే ఒక సినిమాను మొదలుపెడతామని చెప్పారు. మోక్షజ్ఞతోను తమ బ్యానర్ పై సినిమా చేయాలనుందనీ, అది ఎప్పుడు అనేది మాత్రం బాలకృష్ణ గారే ప్రకటిస్తారని స్పష్టం చేశారు.  
balakrishna
sai korrapati

More Telugu News