jagapati babu: టీజర్ చూసి నటించడానికి ఓకే చెప్పిన జగపతి!
తెలుగు చిత్రసీమలో ఇప్పుడున్న బిజీ ఆర్టిస్టులలో జగపతిబాబు ఒకరు. కథా చర్చల్లో ముఖ్యమైన .. కీలకమైన .. విలన్ పాత్రల ప్రస్తావన రాగానే, ముందుగా జగపతిబాబు పేరును ప్రస్తావిస్తున్నారట. అయితే, అంత డిమాండ్ వున్నా కథలో కొత్తదనముంటేనే ఆయన ఓకే చెబుతున్నారు. 'పటేల్ సర్' సినిమానే అందుకు నిదర్శనమని అంటున్నారు.
ఈ సినిమా కథను దర్శకుడు వినిపించినప్పుడు, జగపతిబాబుకి బాగా నచ్చేసిందట. దర్శకుడు కొత్త కావడం వలన తనే ఓ లక్షన్నర రూపాయలిచ్చి, టీజర్ తీసి చూపించమన్నారట. టీజర్ తో దర్శకుడు మెప్పించడంతోనే ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. అయితే తండ్రి రోల్ ఎక్కువగా .. పవర్ ఫుల్ గా వుంటుందని సమాచారం. కథ బాగా నచ్చడంతో పారితోషికం వద్దనేసి .. నిర్మాణ భాగస్వామిగా జగపతిబాబు వున్నారని చెప్పుకుంటున్నారు. 'పటేల్ సర్' ఏం చేస్తాడో చూడాలి మరి.