chiranjeevi: 'ఉయ్యాలవాడ' పై చిరూ బలమైన నిర్ణయం!

'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాకి సంబంధించిన పనుల్లో కొణిదెల ప్రొడక్షన్స్ వారు బిజీగా వున్నారు. స్వాతంత్ర్య  సమరయోధుడి జీవిత చరిత్ర కనుక, ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఆ దిశగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో చిరంజీవి న్యూ లుక్ తో కనిపించనున్నారు.

ఈ సినిమాలో కథానాయికలుగా ఐశ్వర్య రాయ్ .. సోనాక్షి సిన్హా .. నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. కథా పరంగాను .. టెక్నికల్ గాను ఇది భారీ సినిమా. అందువలన చిత్రీకరణకు చాలా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం వుంది. అందువలన అంతా పక్కాగా రెడీ చేసుకుని షూటింగ్ మొదలు పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారట. రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన తరువాత పెద్దగా గ్యాప్ లేకుండా చకచకా పనులు పూర్తి కావాలని చెప్పారట. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రావాలనే బలమైన నిర్ణయాన్ని యూనిట్ వారికి చెప్పేశారని తెలుస్తోంది.     
chiranjeevi
nayanatara

More Telugu News