jagapathibabu: 40 కోట్లకి మించి సంపాదన తనకి అవసరం లేదంటోన్న జగపతిబాబు!

జీవితంలో ప్రతి ఒక్కరూ ఒడిదుడుకులను చూస్తుంటారు. అయితే అవి చిత్రపరిశ్రమలో మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా ఆర్ధిక పరమైన కుదుపులకి లోనైన వారిలో హీరో జగపతిబాబు కూడా కనిపిస్తారు. నిజమైన స్నేహమనుకుని చాలామందికి సాయం చేసి .. ఆర్థికపరమైన ఇబ్బందులను ఫేస్ చేసినట్టుగా ధైర్యంగా చెప్పిన హీరో ఆయన.

 ఇప్పుడు జగపతి బాబుకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అలా అని చెప్పేసి పారితోషికం విషయంలో తాను అత్యాశకి పోనని జగపతిబాబు చెప్పారు. జీవితంలో డబ్బు అవసరమే గానీ .. అవసరానికి మించి సంపాదించాలనే ఆశ తనకి లేదని అన్నారు. తన కుటుంబంలో ఉండేది నలుగురమేననీ .. అందువలన మనిషికో 10 కోట్ల చొప్పున ఓ 40 కోట్లు ఉంటే చాలని చెప్పారు. అంతకుమించి తాను సంపాదించడంలో అర్థం లేదని అన్నారు. త్వరలో జగపతిబాబు 'పటేల్ సర్' గా పలకరించబోతోన్న సంగతి తెలిసిందే.     
jagapathibabu

More Telugu News