: భార్య, బిడ్డ ఏడుస్తున్నా ...సాహసాన్ని ఆపలేదు...వీడియో చూడండి

కొంత మందికి సాహసాలు చేయడం సరదా. అలాంటి సరదా ఉన్న వ్యక్తి ఓ పారాచ్యూట్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. దానిని టెస్టు చేసేందుకు తన బిల్డింగ్ బాల్కనీని ఎంచుకున్నాడు. బహుళ అంతస్తుల భవనంలోని తన ఇంటి బాల్కనీలోంచి పారాచ్యూట్ ధరించి స్నేహితుడు వీడియో తీస్తుండగా, భార్య, కుమార్తె వద్దని వారిస్తున్నా వినకుండా బిల్డింగ్ పై నుంచి కిందికి దూకేశాడు. అయితే జాగ్రత్తగా అతను ల్యాండ్ కావడంతో భార్యాబిడ్డలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఏమాత్రం తేడా జరిగినా, భార్యాబిడ్డల కళ్లముందే జరగరాని ఘోరం జరిగి ఉండేది. అయితే ఇప్పుడతని స్టంట్ ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ స్టంట్ ను బ్రిజిల్ కు చెందిన వ్యక్తి చేయడం విశేషం. ఈ స్టంట్ ను మీరు కూడా చూడండి. 

More Telugu News