: జయహో ఇస్రో... 31 ఉపగ్రహాలతో సగర్వంగా నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ38

నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పోలార్‌ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్‌ఎల్‌వీ)- సీ38 సగర్వంగా నింగికెగసింది. 31 ఉపగ్రహాలతో భారత కీర్తిపతాకను రెపరెపలాడిస్తూ పీఎస్ఎల్వీ-సీ38 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఈ 17వ ప్రయోగం ద్వారా ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సహా మరో 8 దేశాలకు చెందిన ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్టోశాట్‌-2ఇ, తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని భూమికి 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

మనదేశానికి చెందిన కార్టోశాట్-2ఇ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలందిస్తుంది. భూ పరిశీలన చేయనున్న ఈ ఉపగ్రహం సమగ్ర మ్యాపింగ్ తోపాటు భూగర్భజలాల సమాచారంతో పాటు సముద్రతీరంలోని నిక్షిప్తమై ఉన్న వనరుల వివరాలు అందించనుంది. దీని బరువు 712 కేజీలు కాగా, మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు.

More Telugu News