వాట్స్ యాప్ ను తెగ వాడేస్తున్నారు... రోజూ 5 కోట్ల వీడియో కాలింగ్ నిమిషాల నమోదు!

రోజుకు కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు వాడుకుంటూ భారత్ వాట్స్ యాప్ ను వినియోగిస్తున్న దేశంగా అగ్రభాగాన నిలిచిందని తెలిపింది. వాట్స్ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా 100.20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండగా...అందులో కేవలం భారత్ నుంచే 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని వాట్స్ యాప్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు నమోదవుతుండగా... అందులో భారత్ నుంచే 5 కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఇది అనూహ్య విజయమని, ఈ విజయ సాధనకు భారతీయులే కారణమని వాట్స్ యాప్ వెల్లడించింది.