: గాయపడ్డ హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్!

వరుసగా నాలుగు మ్యాచ్ లను గెలిచిన ఆనందంలో ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు పక్కటెముకల్లో గాయమైంది. నిన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న వేళ, యువరాజ్ వేసిన బంతిని రిషబ్ పంత్ బలంగా బాదగా, క్లిష్టమైన ఆ క్యాచ్ ని వార్నర్ పట్టుకున్నాడు. డైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదకరంగా కిందకు జారడంతో, అతని పక్కటెముకల్లో గాయమైంది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం వార్నర్ స్వయంగా వెల్లడించాడు. దీంతో తదుపరి మ్యాచ్ కి వార్నర్ అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. కాగా, నిన్నటి మ్యాచ్ లో ఇరు జట్ల మధ్యా హోరాహోరీగా పోరు సాగగా, ఢిల్లీ జట్టు 15 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News