nagaland cm : జీతాలు తీసుకుంటున్నాం.. పనిచేయండి: నాగాలాండ్ సీఎం

ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలను అందించాలని నాగాలాండ్ ముఖ్యమంత్రి షురోజిలి లీజిత్సు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించి, ఉదయం 9.30లోపు తమ కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నది ప్రజలకు సేవచేయడానికేనని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని అన్నారు. తాను ప్రజలకు సేవకుడినని, తన వల్ల ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని చోట్లకు తిరుగుతూ సేవలందిస్తానని లీజిత్సు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరయినా సరే అందరూ తనను సచివాలయంలోనే కలుసుకోవాలని, ప్రైవేటుగా కలుసుకోవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వొద్దని అధికారులకు సూచించారు.

More Telugu News