dasari health: దాస‌రి నారాయ‌ణ రావుగారి ఆరోగ్యం కుదుటపడుతుంది.. ఆయన ఆరోగ్యం కోసం అంద‌రూ ప్రార్థించండి: మోహ‌న్‌బాబు

తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి, ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు ఆరోగ్యం కుదుటప‌డుతుంద‌ని సినీన‌టుడు మోహ‌న్‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆసుప‌త్రి వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఉద‌యం నుంచి తాను అక్క‌డే ఉన్నట్లు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ మంచి మ‌న‌సుతో ఆయ‌న ఆరోగ్యం కోసం ప్రార్థించాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని కోరుకుంటూ సాయినాథుడిని ప్రార్థించేందుకు తాను షిర్డీ వెళుతున్న‌ట్లు పేర్కొన్నారు. దాస‌రి ఆరోగ్యంగా వ‌స్తే ఎన్నో కుటుంబాలు బాగుప‌డ‌తాయని తెలిపారు. ఆయ‌న నూరేళ్లు బాగుండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

More Telugu News