arrests: ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికుడి వ‌ద్ద భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టివేత

ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్ కతా విమానాశ్ర‌యంలో సోదాలు నిర్వహిస్తోన్న‌ క‌స్ట‌మ్స్ అధికారులు ఇటీవ‌లే కోల్‌క‌తాకు చెందిన ఓ వ్య‌క్తి నుంచి ఏకంగా ల‌క్షా 20 వేల అమెరికన్‌ డాల‌ర్లు (సుమారు రూ.80,00,000) ను స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం కూడా అదే ఎయిర్‌పోర్టులో ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడిని త‌నిఖీ చేసిన క‌స్ట‌మ్స్ అధికారులు అతడి వ‌ద్ద రూ.98 లక్ష‌లు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన యూరోలు, పౌండ్స్‌, దిర్హామ్‌లు, రియాల్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు, నిందితుడిని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

More Telugu News