demonitisation: నోట్లరద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి: ఆర్‌బీఐ గవర్నర్

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ రోజు పార్లమెంటరీ పీఏసీ(ప్రజా పద్దుల కమిటీ) సభ్యుల ముందు హాజరయి వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయని ఆయ‌న చెప్పారు. నోట్ల రద్దు అంశం ఆర్థిక వ్యవస్థకు మంచిదేన‌ని, అయితే, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డ మాట వాస్తమేనని వ్యాఖ్యానించారు. నగ‌దు ర‌హిత లావావీలపై ఛార్జీలు తగ్గించి ప్ర‌జ‌ల‌ను ఆ దిశ‌గా ప్రోత్స‌హిస్తామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. దీనిపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడతామ‌ని, ఒక విధానాన్ని రూపకల్పన చేస్తామని చెప్పారు. సహకార బ్యాంకుల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై విచారణ జరిపించాలని ఈ సంద‌ర్భంగా పీఏసీ సభ్యులు ఆయ‌న‌ను కోరారు.

More Telugu News