yuvi: యువరాజ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించిన అమితాబ్

మూడేళ్ల త‌రువాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన యువ‌రాజ్ సింగ్ నిన్న జ‌రిగిన‌ క‌ట‌క్ వ‌న్డేలో అద్భుతంగా రాణించి ఇంగ్లండ్‌పై విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. యువ‌రాజ్ నిన్న క్రీజులో క‌న‌బ‌రిచిన ఆటతీరుప‌ట్ల బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బచ్చన్ ఆయ‌నపై ప్ర‌శంస‌లు కురిపించారు. 150 పరుగులతో రాణించి సిరీస్ కైవసం చేసుకునేలా చేసిన యువరాజ్ సింగ్ అసాధారణమైన ఛాంపియన్ అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇంగ్లండ్ జట్టును ఓడించడం ఓ అరుదైన విజయమని అన్నారు.


yuvi
cricket
amitab

More Telugu News