: 'స్పీడు' పెంచిన రిల‌య‌న్స్ జియో.. వెల్ల‌డించిన ట్రాయ్‌

సంచ‌ల‌న ఆఫ‌ర్‌తో టెలికం రంగంలో అడుగుపెట్టి వినియోగ‌దారుల‌ను త‌న‌వైపు తిప్పుకున్న రిల‌య‌న్స్ జియో మ‌రింత 'స్పీడు'గా దూసుకుపోతోంది. గతంతో పోలిస్తే జియో 4జీ నెట్‌వ‌ర్క్ డౌన్‌లోడింగ్ వేగం బాగా పెరిగిన‌ట్టు టెలికం నియంత్ర‌ణ సంస్థ (ట్రాయ్) పేర్కొంది. గ‌త‌నెల‌లో ఐడియా 4జీ వేగం 5.03 ఎంబీపీఎస్‌, ఎయిర్‌టెల్ 4.68, ఎయిర్‌సెల్ 3, బీఎస్ఎన్ఎల్ 3.42, రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ వేగం 2.6 ఎంబీపీఎస్‌లుగా న‌మోదుకాగా జియో స్పీడ్ 18.16 ఎంబీపీఎస్‌గా న‌మోదైన‌ట్టు ట్రాయ్ వెల్ల‌డించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో న‌మోదయ్యే డౌన్‌లోడింగ్ వేగాన్ని మై స్పీడ్ అప్లికేష‌న్ ద్వారా లెక్కించి ట్రాయ్ ప్ర‌తినెల ఈ వివ‌రాల‌ను విడుద‌ల చేస్తుంది. కాగా న‌వంబ‌రులోనూ జియో వేగం మిగ‌తా నెట్‌వ‌ర్క్‌ల కంటే ఎక్కువేన‌ని ట్రాయ్ తెలిపింది.

More Telugu News