చివరిదశకు చేరుకున్న రూ.4500 కోట్ల డీల్... భారీగా శతఘ్నుల కొనుగోలు!
భారత్ సరిహద్దు దేశాలయిన పాకిస్థాన్, చైనాలు తమ సైనికశక్తిని పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా సైనిక ఆధునికీకరణకు వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. దాదాపు 100 శతఘ్నులకు సంబంధించిన ధరను ఎల్&టీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయగానే సదరు ఫైల్ కేంద్ర మంత్రివర్గ కమిటీ ముందుకు రానుంది. దీనికి రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. త్వరలోనే ఈ ఫైల్ ఆ శాఖ వద్దకు చేరుకుంటుంది.