Bipin Rawat: తప్పనిసరి అయితే శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే విషయంలో వెనక్కి తగ్గం: భారత కొత్త సైన్యాధ్యక్షుడు

తప్పనిసరి అయితే భార‌త‌ సైన్యం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోద‌ని కొత్త సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ స్ప‌ష్టం చేశారు. ఈ రోజు గౌరవవందనం అందుకున్న అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ... సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలను నెల‌కొల్ప‌డ‌మే సైనికబలగాల కర్తవ్యమని, ఈ క్ర‌మంలో తాము వెన‌క్కిత‌గ్గ‌బోమ‌ని అన్నారు.

భార‌త‌ ఆర్మీ యూనిట్లన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ఒక‌ యూనిట్‌గా స‌మన్వ‌యంతో విధుల్లో పాల్గొంటాయ‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం సీనియర్ లెఫ్టెనెంట్ జనరల్స్ ప్రవీణ్ బక్షి, పి.ఎం.హరిజ్‌‌లను కాద‌ని జనరల్ రావత్‌‌ను ఆర్మీ చీఫ్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా లెఫ్టినెంట్ జనరల్ బక్షి మీడియాతో మాట్లాడుతూ... బిపిన్ రావ‌త్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
Bipin Rawat

More Telugu News