gold rate: పెరిగిన పసిడి ధర.. వెండి కూడా!

అంతర్జాతీయ, దేశీయ పరిణామాల నేపథ్యంలో భారత్ లో రోజురోజుకీ దిగుతూ వ‌స్తోన్న బంగారం ధ‌ర నిన్న కాస్త పెరిగింది. బంగారం దుకాణదారుల నుంచి డిమాండు త‌గ్గ‌డంతో రెండు రోజుల క్రితం బంగారం ధ‌ర‌ 11 నెలల కనిష్టాన్ని నమోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా వారి నుంచి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.175 పెరిగి రూ.28,200గా న‌మోద‌యింది. మరోవైపు వెండిధ‌ర కూడా పెరిగింది. మార్కెట్లో కిలో వెండి రూ.350 పెరిగి రూ.39,500కి చేరుకుంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర 0.35శాతం పెరిగి ఔన్సు 1,142.30 సింగ‌పూర్‌ డాలర్లకు చేరుకుంది.

More Telugu News