sundar pichai: భార‌త్‌కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రాక‌!

ఢిల్లీలో వ‌చ్చే నెల 4న 'స్మాల్ అండ్ మీడియం బిజినెస్' సంస్థ నిర్వహించ‌నున్న‌ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్ర‌ముఖ స‌ర్చింజ‌న్‌ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హాజరుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయనతో పాటు ప‌లువురు గూగుల్ సంస్థ ప్ర‌తినిధులు కూడా పాల్గొంటారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. కొన్నేళ్లుగా గూగుల్ దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులకు అంత‌ర్జాల భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే.

టెక్నాలజీ విభాగంలో రానున్న కాలంలో ఇండియా ముఖ్య‌పాత్ర పోషిస్తుంద‌ని సుందర్  పిచాయ్ ఇటీవ‌లే వ్యాఖ్యానించారు. భారత్ లో ఆయ‌న ముఖ్యంగా డిజిటల్ పవర్ ద్వారా ఎస్ఎంబీ-గూగుల్ భాగస్వామ్యంపై ఆయన ముఖ్యంగా దృష్టి సారించారు. గూగుల్ భాగస్వామ్యంతో దేశంలోని దాదాపు 400 రైల్వే స్టేషన్లలో కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఉచిత వై ఫై సదుపాయాన్ని తీసుకొచ్చింది. వ‌చ్చే ఏడాది చివ‌రినాటికి ఈ సంఖ్య‌ను రెండింత‌లు చేయ‌నున్నారు.

More Telugu News