hardik patel: రాజస్థాన్ లో గుజరాత్‌ పటీదార్‌ అనామత్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌ అరెస్ట్

రాజస్థాన్‌లోని జయపురలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన గుజరాత్‌ పటీదార్‌ అనామత్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌ను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను అకారణంగా అరెస్టు చేశార‌ని హార్దిక్ ప‌టేల్ రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, అక్క‌డ హార్దిక్ ప‌టేల్‌ ప్రాణానికి ముప్పు ఉందని, అందుకే తాము ఆయనను అరెస్టు చేయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని పోలీసులు తెలిపారు. హార్దిక్‌ప‌టేల్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినందుకే త‌న‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తన‌కు తెలిపార‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌ను అరెస్టు చేసిన కార‌ణాల‌పై స్ప‌ష్ట‌మైన వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు.

More Telugu News