demonitisation: ఒక్కోనోటుకి ఎంతెంత?.. ముద్రణకు అవుతున్న ఖర్చుల వివరాలు తెలిపిన ఆర్బీఐ

దేశంలో పాత రూ.500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌రువాత రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో కొత్త‌నోట్ల‌ను ముద్రిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఇందు కోసం ఎంత ఖ‌ర్చు అవుతుంద‌ని, సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ ఓ వ్య‌క్తి వివరాలు అడిగారు. అందుకు రిజర్వు బ్యాంకు అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంపీఎల్) సంస్థ వివ‌రాలు వెల్ల‌డించింది.

కొత్త 500 నోటును ముద్రించాలంటే ఒక్కోదానికి రూ. 3.09, 2 వేల రూపాయల నోటు ముద్ర‌‌ణ‌కు రూ. 3.54 చొప్పున ఖర్చవుతుంద‌ని పేర్కొంది. దీని ప్ర‌కారం వెయ్యి కొత్త 5 వందల రూపాయ‌ల నోట్ల‌ ముద్ర‌ణ‌కు గాను మొత్తం రూ. 3090 ఖర్చవుతుందని, ఇక‌ రెండు వేల‌ నోట్లు వెయ్యి ముద్రించాలంటే రూ. 3540 ఖ‌ర్చు అవుతుంద‌ని పేర్కొంది. తాజాగా మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త 500 రూపాయల నోట్ల బ్యాచ్‌ని రెండు నంబర్ ప్యానళ్లలోను 'ఆర్' అనే అక్షరంతో ముద్ర‌ణ చేస్తున్న‌ట్లు రిజ‌ర్వు బ్యాంకు తెలిపింది. అంగేగాక‌, ప్ర‌స్తుతం ఉన్న 50 నోట్ల‌ను ర‌ద్దు చేయ‌కుండా కొన్ని రోజుల్లో కొత్త 50 రూపాయల నోట్లను కూడా విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

More Telugu News