demonitisation: భారీ ఊర‌ట‌.. బ్యాంకుల్లో డిపాజిట్ల‌పై విధించిన కొత్త నిబంధ‌నను ఉప‌సంహ‌రించుకున్న కేంద్ర ప్ర‌భుత్వం

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో అక్ర‌మ డిపాజిట్‌ల‌ను నిరోధించేందుకు ఈనెల 19న రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు డిపాజిట్‌ల‌పై ఆంక్షలు విధించిన విష‌యం తెలిసిందే.  డిసెంబర్‌ 19 నుంచి 30 వరకూ ఖాతాదారులు త‌మ‌ వ్యక్తిగత ఖాతాల్లో రద్దైన నోట్లను రూ. 5 వేలకు మించి ఒక్కసారి మాత్రమే జమ చేసుకోవాలని, అంతేగాక‌, రూ. 5 వేలకు మించి జ‌మ‌ చేస్తున్న సమయంలో ఆలస్యానికి కారణాలు కూడా వెల్లడించాలని రెండు రోజుల క్రితం పేర్కొంది.

అయితే, ఈ రోజు ఈ నిబంధ‌న‌ల‌న్నింటినీ ఉప‌సంహ‌రించుకుంది. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌యిన ఆగ్ర‌హంతో కేంద్ర ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది. డిసెంబ‌రు 19 నాటి స‌ర్క్యుల‌ర్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 5 వేల పైన చేసే డిపాజిట్ల‌పై కొత్తగా విధించిన నిబంధ‌న‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపింది. ఖాతాదారులు ఎటువంటి వివ‌రాలు తెల‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఐదు వేల‌కు మించి న‌గ‌దును ఎన్ని సార్లైనా డిపాజిట్ చేసుకోవ‌చ్చని తెలిపింది.

More Telugu News