demonitisation: న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితి ఎత్తివేత‌పై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు: అరుణ్ జైట్లీ

కొంత‌మంది వ‌ల్ల బ్యాంకు ఉద్యోగుల‌కు చెడ్డ పేరు వ‌చ్చింద‌ని కేంద్ర‌ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పెద్దనోట్ల ర‌ద్దు అనంత‌రం ఏర్ప‌డిన ప‌రిస్థితులపై ఆయ‌న ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.  పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నప్ప‌టి నుంచి ఈ రోజు వ‌ర‌కు ఆర్‌బీఐ బ్యాంకుల‌కు న‌గ‌దు పంపిణీ చేస్తూనే ఉంద‌ని ఆయ‌న అన్నారు. అన్ని బ్యాంకుల‌కు స‌రిప‌డా న‌గ‌దును ఆర్‌బీఐ పంపిణీ చేస్తోందని వ్యాఖ్యానించారు. బ్యాంకు ఉద్యోగులు అధిక స‌మ‌యం ప‌నిచేశారని ప్ర‌శంసించారు. డిమాండుకు స‌రిప‌డా న‌గ‌దు బ్యాంకులకి పంపుతున్న‌ట్లు చెప్పారు. న‌గ‌దుర‌హిత లావాదేవీలు రోజు రోజుకీ పెరుగుతున్నాయ‌ని చెప్పారు. న‌గ‌దుర‌హిత లావాదేవీల‌పై ప్రోత్సాహ‌కాల‌ను కూడా ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. అన్ని ఏటీఎంలలో కొత్తనోట్లు రావడానికి అవసరమైన మార్పులు జరిగాయని అన్నారు. న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితి ఎత్తివేత‌పై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదని అన్నారు.

More Telugu News