demonitization: దళారి నుంచి రూ.10 కోట్ల విలువైన పాతనోట్లు, 6 కిలోల బంగారం స్వాధీనం

పెద్దనోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా నిఘా ఉంచి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోన్న అధికారులు ప‌లువురి వ‌ద్ద ల‌భిస్తోన్న న‌గ‌దు, బంగారం చూసి షాక్ కి గుర‌వుతున్నారు. దేశంలో న‌ల్ల‌ధ‌నం ఎంత‌గా పేరుకుపోయిందో తెలిపే ఘ‌ట‌న‌లు ఎన్నో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. త‌నిఖీల్లో భాగంగా ఈ రోజు చెన్న‌య్‌లో సోదాలు జ‌రిపిన ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు న‌గ‌రంలోని ఓ బంగారం దళారి నుంచి రూ.10 కోట్ల విలువైన పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక, అత‌డివద్ద ఏకంగా 6 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. న‌ల్ల‌కుబేరులు త‌మ డ‌బ్బుని బంగారం రూపంలో నిల్వ‌చేసుకోవ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ర‌ద్ద‌యిన నోట్లను మార్చుకోవ‌డానికి మ‌రో ప‌దిరోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో ఇటువంటి ఘ‌ట‌న‌లు అధికంగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

  • Loading...

More Telugu News