: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 114.86 పాయింట్లు కోల్పోయి 26,374.70 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.10 పాయింట్ల నష్టంతో 8,104.35 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. గెయిల్, అరబిందో ఫార్మా, గ్రాసిమ్, టాటా పవర్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర సంస్థల షేర్లు లాభపడగా, భారతీ, ఇన్ ఫ్రాటెల్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మొదలైన సంస్థల షేర్లు నష్టపోయాయి.

కాగా, ఆరంభ ట్రేడింగ్ లోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు, ఒడిదుడుకుల మధ్య చివరకు నష్టాలతో ట్రేడింగ్ ను ముగించాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ కు కలిసి రాలేదు. వచ్చే ఏడాది కూడా అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను పెంచగలదన్న భయాలను వెంటాడాయని, దీంతో, మదుపరులు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతవారం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య సాగిన ట్రేడింగ్ లో దేశీయ మార్కెట్లు నష్టాలతోనే ముగియడం గమనార్హం.

More Telugu News