Cyclone Vardah: వార్దా బారినపడ్డ చెన్నైకి వర్షాల ముప్పు... వాతావరణ శాఖ హెచ్చరికలు

గోరుచుట్టుమీద రోకలి పోటు అంటే ఇదేనేమో...వార్దా తుపాను మిగిల్చిన బీభత్సంతో అతలాకుతలమై, నెమ్మదిగా తేరుకుంటున్న చెన్నైని మరో భయం పట్టుకుంది. రాగల 12 గంటల్లో తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వార్దా తుపాను తీరం దాటడంతో దాని ప్రభావంతో వర్షాలు కురియనున్నాయని, దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తమిళనాట సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. కాగా, నిన్న వార్దా తుపాను ధాటికి, ఏపీలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. 

More Telugu News