: కోహ్లీకి సాధ్యం కానిది కేఎల్ రాహుల్ సాధించాడు...రాహుల్ అత్యంత ప్రమాదకారి: గేల్

టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ భవిష్యత్ లో గొప్ప ఆటగాడిగా మారతాడని వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ జోస్యం చెప్పాడు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గేల్ మాట్లాడుతూ, 'కోహ్లీ అంతటి ప్రమాదకర ఆటగాడు కేఎల్ రాహుల్' అన్నాడు. రాహుల్ నిలకడగా ఆడుతూ, భారీ షాట్లు ఆడగలడని గేల్ కితాబునిచ్చాడు. కాగా, రాహుల్ పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. కాగా, వారి వ్యాఖ్యల వెనుక రాహుల్ సాధించిన ఘనత ఉంది. కోహ్లీకి కూడా సాధ్యం కాని ఆ ఘనత ఏంటంటే... అంతర్జాతీయ క్రికెట్ లో అంతర్జాతీయ వేదికలపై మూడు ఫార్మాట్లలో సెంచరీ చేయడం. గత ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున కోహ్లీ, డివిలియర్స్ తరువాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు రాహుల్ కావడం విశేషం.

More Telugu News