: 12 సెంటర్లు ప్రారంభించాం...యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి: కవిత

రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ జాగృతి శిక్షణా కేంద్రాలు నిర్వహించనుందని ఎంపీ కవిత తెలిపారు. హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా 12 నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇంత వరకు తెలంగాణ జాగృతి సమాజాన్ని చైతన్యం చేసిందని, ఇకపై యువతకు శిక్షణ ఇచ్చి, వారిని నైపుణ్యవంతులను చేసి, వారి ఉపాధికి బాటలు వేస్తుందని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగుల శాతం ఎక్కువ అని చెప్పిన ఆమె, నిరుద్యోగులైన తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ 12 నైపుణ్య శిక్షణాకేంద్రాలకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని ఆమె తెలిపారు. తెలంగాణ నిరుద్యోగ యువత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

More Telugu News