: సౌదీలో చిక్కుకుపోయిన భారత కార్మికులకు సుష్మా డెడ్‌లైన్!

సౌదీలో ఉద్యోగాలు కోల్పోయి చిక్కుకుపోయిన భారత కార్మికులకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ డెడ్‌లైన్ విధించారు. సెప్టెంబరు 25లోపు భారత్‌కు తిరిగొస్తే సరేసరి. లేకుంటే సొంత ఖర్చులతోనే రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఉద్యోగాలు కోల్పోయి సౌదీలో అవస్థలు పడుతున్న భారత కార్మికులు తిరిగి స్వదేశానికి రావాల్సిందిగా కోరుతున్నా. వచ్చే నెల 25లోగా ఇండియా వచ్చేందుకు సిద్ధం కండి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. లేదు.. అక్కడే ఉంటామన్న వారు తర్వాత స్వదేశానికి రావాలని భావిస్తే అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వారే చేసుకోవాల్సి ఉంటుంది’’ అని సుష్మ పేర్కొన్నారు. పని కోసం పరాయిదేశం వెళ్లి ఉద్యోగాలు కోల్పోయి పడరాని పాట్లు పడుతున్న భారత కార్మికుల కష్టాలపై సుష్మ వెంటనే స్పందించిన సంగతి తెలిసిందే. బాధిత కార్మికులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడంతోపాటు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపి కార్మికులను క్షేమంగా భారత్ తీసుకొచ్చేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు కార్మికులు సౌదీ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న విషయం విదితమే.

More Telugu News