: పళ్లు తింటే ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా మీ సొంతం!... పరిశోధనల్లో వెల్లడి

పళ్లు తింటే ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా సొంతమవుతుందని లండన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రెండు వేల మందిపై నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనల్లో ఈ విషయం నిర్ధారణ అయిందని వారు తెలిపారు. ఈ రెండు వేల మందిని పరిశోధకులు రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల్లో ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ ఆహారంతో పాటు ఐదురకాల పళ్లు అందించారు. రెండవ గ్రూపు వారికి పళ్లను మినహాయించి కేవలం ఆహారం మాత్రమే అందించారు. కొన్ని నెలలపాటు వారికి ఇలా నిబంధనలతో కూడిన ఆహారాన్ని అందజేసి వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించారు. ప్రతిరోజూ ఆహారంతో పాటు పళ్లను తీసుకున్న వారిలో పలు రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టగా, కేవలం ఆహారం మాత్రమే తీసుకున్న వారిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత తగ్గడాన్ని గుర్తించారు. అయితే పరిశోధకులు గుర్తించిన ఈ మార్పులు కేవలం పళ్లు తీసుకోకపోవడం వల్లే వచ్చాయా? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఆహారంతో పాటు పళ్లు తీసుకోవడం ఆరోగ్యంతోపాటు ఆనందం కూడా సొంతమవుతుందని వారు తెలిపారు.

More Telugu News