: సీజన్ వస్తోందని ఒకేసారి విత్తనాలు నాటవద్దు: పరిటాల సునీత

సీజన్ వస్తోందని ఒకేసారి విత్తనాలు నాటడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురంలోని మార్కెట్ యార్డును పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పండిన పంటంతా ఒకేసారి కోతకు రావడంతో టమాటా రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులంతా ఒకేసారి నాట్లు వేయడం, కోతకోయడంతో ఈ నష్టం వాటిల్లుతోందని, అలా కాకుండా పది రోజుల విరామంతో నాట్లు వేయడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఒక రైతును చూసి మరో రైతు నాట్లు వేయవద్దని, విరామం తీసుకుని నాట్లు వేయాలని ఆమె సూచించారు. కాగా, టమాటా రైతులకు మద్దతు ధర లభించకపోవడం, మధ్యవర్తుల జోక్యం పెరిగిపోవడంతో మార్కెట్ యార్డుకు తెచ్చిన పంటను పారబోసి వెళ్లిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.

More Telugu News