: 16 ఏళ్ల దీక్షకు తెర.. సీఎం అవుతాన‌ని ఇరోమ్ ష‌ర్మిల వ్యాఖ్య‌

మ‌ణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా, త‌మ‌ హక్కుల కోసం 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉక్కు మహిళ ఇరోమ్ దీక్ష‌కు ఈరోజు తెర‌ప‌డింది. దీక్ష విర‌మించే ముందు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హజరై తనపై ఉన్న‌ కేసులన్నీ ఎత్తివేయాలని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ఆమె తన త‌ప్పులను ఒప్పుకోవాల‌ని అప్పుడే ఆ కేసులను కొట్టివేస్తామ‌ని న్యాయ‌మూర్తి అన్నారు. దీనిపై తిరిగి ఈనెల 23న విచార‌ణ జ‌రుపుతామ‌ని చెప్పారు. కోర్టునుంచి బ‌య‌ట‌కు రాగానే షర్మిలా తన దీక్షను విరమించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను చేస్తోన్న డిమాండ్‌ను నెర‌వేర్చుకునే క్ర‌మంలోనే తాను రాజ‌కీయాల్లోకి రానున్నాన‌ని, మ‌ణిపూర్‌కి సీఎం అవుతాన‌ని పేర్కొన్నారు. కాగా, ఆమెపై ఉన్న కేసుల‌పై ఇరోమ్ ష‌ర్మిల‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల వ్య‌క్తిగ‌త బాండ్ స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది.

More Telugu News