: పెట్రోల్, డీజిల్ తగ్గించిన 24 గంటల్లో రాయితీ గ్యాస్ సిలెండర్ ధర పెంపు

లీటర్ పెట్రోలుపై 1.42 రూపాయలు, లీటర్ డీజిల్ పై 2.01 రూపాయలు తగ్గించిన 24 గంటల్లోనే రాయితీ గ్యాస్ సిలెండర్ ధరను పెంచడం విశేషం. జూలై 1న రాయితీ గ్యాస్ సిలెండర్ పై 1.98 రూపాయలు పెంచిన ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలో రెండోసారి ధర పెంచింది. తాజగా సమావేశమైన అధికారులు రాయితీ గ్యాస్ సిలెండర్ పై 1.93 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ సబ్సిడీ ఎత్తేయాలని పిలుపునిస్తున్న ప్రభుత్వం మరోవైపు రాయితీ ధర పెంచడంపై దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News