: రూ. 33,500 కోట్లతో యాహూను కొనేసిన వేరిజోన్!

ఇంటర్నెట్ దిగ్గజంగా ఓ వెలుగు వెలిగి, గూగుల్ ప్రవేశంతో వెనుకబడిన 'యాహూ'ను కొనుగోలు చేసేందుకు వేరీజోన్ కమ్యూనికేషన్స్ 5 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 33,500 కోట్లు) ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందు (భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 6:30 గంటలకు) వెల్లడిస్తారని డీల్ గురించి తెలిసిన వర్గాలు వ్యాఖ్యానించాయి. యాహూ భవిష్యత్తు ఏమవుతుందా? అన్న సందేహాలకు తెరవేస్తూ, కొత్త వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికలతో కూడిన విధంగా డీల్ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు యాహూ సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేకపోగా, కామెంట్ చేసేందుకు వేరీజోన్ నిరాకరించింది. యాహూను దక్కించుకునే పోరులో వేరీజోన్ ముందు నిలిచిందని శుక్రవారమే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీల మధ్యా 4.8 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందని ఆదివారం నాడు 'బ్లూమ్ బర్గ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

More Telugu News